ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశమంతా అల్లకల్లోలంగా మారింది.దేశంలో ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు.రోజురోజుకు కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.
ఇక కొందరు సెలబ్రెటీలు తమ వంతు సహాయాన్ని కి ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు.
బాధితులకు తమ వంతు సహాయం తో ముందుకు వస్తున్నారు.ఇప్పటికే గత ఏడాది నుండి సహాయం చేస్తున్న సోనూసూద్ గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఆయనలాంటి ఎంతోమంది సెలబ్రెటీలు ఆక్సిజన్ అందించడానికి, అనాథ పిల్లలను పెంచి పోషించడం వంటి బాధ్యతలు తీసుకున్నారు.రోజు రోజుకు ఇండస్ట్రీ నుండి సెలబ్రిటీలలో ఎవరో ఒకరు బాధితులను కాపాడడానికి ముందుకు వస్తున్న తరుణంలో తాజాగా.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు.హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి తమ వంతు సహాయం చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మరువలేని అభిమానులు.ఆయన గుర్తింపుతో తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.కరోనా బాధితులకు ఆక్సిజన్, ప్లాస్మా వంటివి అందజేశారు.
అంతేకాకుండా ‘సుశాంత్ కా కిచెన్‘ పేరుతో పేదలకు నిత్యావసరాలు అందిస్తున్నారు.ఇక సుశాంత్ అభిమానులు చేస్తున్న సహాయానికి ఇప్పటికే ఎంతోమంది అభిమానులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతేకాకుండా వీరి సహాయాన్ని స్పందించిన సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి.వాళ్లు చేస్తున్న గొప్ప పనికి ప్రశంసలు కురిపించింది.
మీరు వేసిన ముందడుగు చాలా గొప్పదంటూ వారిని బాగా మెచ్చుకుంది.