సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని.జనాల ఆదరణ అభిమానాలతో పాటు డబ్బు, పేరు సంపాదించాలని ఎంతో మంది కలలు కంటారు.
రంగుల ప్రపంచాన్ని ఊహించుకుని సినిమా అవకాశాల కోసం కాళ్ల చెప్పులు అరిగేలా ప్రయత్నింస్తుంటారు.అయినా వేషాలు దొరుకుతాయన్న నమ్మకం ఉండదు.
అలాంటి వారిలో ఒకరు జగదీశ్వరి అలియాస్ వైజాగ్ శకుంతల.నటనలో తనకు ఎంతో మంచి ప్రావీణ్యం ఉన్నా సినిమా పరిశ్రమలో రాణించలేకపోయారు.తాజాగా తన ఆవేదనను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఇంతకీ తను ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైజాగ్ శకుంతల దాదాపు మూడు వేల నాటక ప్రదర్శనలు ఇచ్చింది.సుమారు 1200 బహుమతులు తీసుకుంది.వెయ్యి నాటకాల్లో పాల్గొన్నది.2006 నుంచి హైదరాబాద్ లోనే నివాసం ఉంటుంది.ప్రస్తుతం ఆమెకు 55 ఏండ్లు నిండాయి.అయినా తనకు సినిమాల్లో అంతగా గుర్తింపు రాలేదు.అడపాదడపా సినిమాల్లో చిన్నా చితక పాత్రలే తప్ప పెద్ద పేరు తెచ్చిన క్యారెక్టర్లు ఆమె వేసిన దాఖాలు లేవు.ఆమె వేయలేదు అనడం కంటే తనకు దర్శకనిర్మాతలు ఇవ్వలేదు అని చెప్పుకోవచ్చు.
సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పడం తప్ప.ఇచ్చింది లేదు అని చెప్పింది శకుంతల.
ఇప్పుడు ఎంత చిన్న క్యారెక్టర్ ఇచ్చినా.నటన కంటే గ్లామర్ చూస్తున్నారని చెప్పింది.
తనకు గ్లామర్ లేకపోవడం మూలంగానే అవకాశాలు రావడం లేదని చెప్పింది.
దర్శకుడు తేజ తెరకెక్కించిన నువ్వు-నేను సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం తనను ముందు అడిగారని.ఆ తర్వాత పలు రాజకీయాలతో తనదాకా రాకుండానే వేరే వారికి వెళ్లిపోయిందని చెప్పింది.తనకు ఎంతో బాధ కలిగినట్లు వెల్లడించింది.
తనకు నటన తప్ప మేరే పని తెలియని చెప్పింది.అందుకే సినిమాల్లో, సీరియల్స్ లో ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యడానికి రెడీగా ఉన్నట్లు చెప్పింది.
ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పింది.ఏ టీమ్ తో చేసినా తన అకౌంట్ లో 10 వేల రూపాయలు వేస్తారని చెప్పింది.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతుంటే.చమ్మక్ చంద్ర ఫోన్ చేసి.
ఆరోగ్యం గురించి ఆరా తీశాడని చెప్పింది.అంతేకాదు.10 వేల రూపాయలు పంపినట్లు చెప్పింది.