డార్క్ సర్కిల్స్.కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి అతిపెద్ద కారణం కంటినిండా నిద్ర లేకపోవడం.అలాగే ఒక్కోసారి అతిగా పడుకున్న సరే డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
ఇక డీహైడ్రేషన్, స్ట్రెస్, ధూమపానం, థైరాయిడ్, సూర్యరశ్మికి అతిగా బహిర్గతం అవ్వడం వంటి కారణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.దాంతో ఈ డార్క్ సర్కిల్స్ ను త్వరగా వదిలించుకోవడం ఎలాగో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వాడితే కనుక కేవలం పది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.
నూనె కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా స్లైసెస్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్ పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
కనీసం పది నిమిషాలు పాటు మసాజ్ చేసుకుని ఆపై నిద్రించాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే కేవలం కొద్ది రోజుల్లోనే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు తగ్గు ముఖం పడతాయి.
కాబట్టి నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.