కన్న కూతురి విషయంలో షాకింగ్ నిజం తెలుసుకున్న వియత్నామీస్ తండ్రి.. చివరికి?

వియత్నాం(Vietnam) దేశానికి చెందిన లాన్ అనే ఓ యువతి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.ఆమె తండ్రి తన కూతురు తనలాగానో లేదా తన భార్యలాగానో లేదని గమనించారు.

 After Learning The Shocking Truth About His Daughter, The Vietnamese Father.. In-TeluguStop.com

లాన్ పెద్దదయ్యాక ఈ తేడాలు మరింత స్పష్టంగా కనిపించడంతో ఆయనకు అనుమానం వచ్చింది.దీంతో ఆయన డీఎన్ఏ పరీక్ష(DNA) చేయించుకున్నారు.

పరీక్ష ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చాయి.లాన్‌కు జన్మనిచ్చిన తండ్రి తాను కాదని తేలింది.

ఈ నిజం తెలుసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు.చివరకు ఆయనకు ఆసుపత్రిలో ఒక పొరపాటు జరిగిందని తెలిసింది.

లాన్ చదువుకోవడానికి వెళ్లిన కొత్త పాఠశాలలో తనతో సమానంగా జన్మించిన మరో అమ్మాయిని కలిసింది.ఈ కలయిక వల్ల ఈ నిజం వెలుగులోకి వచ్చింది.లాన్ తన తల్లిదండ్రులను పోలి ఉండకపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర సంక్షోభం నెలకొంది.ఈ విషయం తెలుసుకున్న లాన్ తండ్రి, భార్యపై అనుమానం పెంచుకున్నారు.

డీఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ (DNA test results)ఆయన అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి.తన భార్య హాంగ్‌పై మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమెను తరచూ నిందిస్తూ ఉండేవారు.

ఈ విషయం మనస్తాపానికి గురైన హాంగ్ తన కూతురు లాన్‌తో కలిసి హనోయికి వెళ్లిపోయారు.

Telugu Daughters Mix, Dna Mix, Drama, Error, Identity, Nri, Love, Vietnam-Telugu

అక్కడ ఒక పార్టీలో లాన్‌కు తెలిసిన మరొక అమ్మాయికు, తనకు ఫిజికల్‌గా చాలా సిమిలారిటీస్‌ ఉన్నాయని హాంగ్ గమనించారు.అనుమానం వచ్చిన ఆ అమ్మాయి తల్లి డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నారు.పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి.

లాన్ తనకు పుట్టలేదు అని తల్లికి తెలిసింది.ఇలా ఈ తల్లిదండ్రులకు (parents) లాన్ అనే అమ్మాయి అసలు కన్న కూతురు కాదనే విషయం తెలిసింది.

లాన్‌, వేరే అమ్మాయి పేరెంట్స్ మారిపోయారని, బర్త్ సమయంలో ఆసుపత్రిలో పొరపాటు జరిగిందని తేలింది.

Telugu Daughters Mix, Dna Mix, Drama, Error, Identity, Nri, Love, Vietnam-Telugu

ప్రస్తుతం రెండు కుటుంబాలు కలిసి ఈ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాయి.ఈ పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు.అంతేకాకుండా, ఈ పొరపాటుకు బాధ్యత వహించాల్సిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా అనే దానిపై కూడా ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube