మంచు లక్ష్మీ ప్రసన్న….ఈ పేరు వినగానే మనకి నిలదీసిఫై గుర్తొస్తుంది.
ప్రతీ విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతూ అందులోనూ ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ.సోషల్ మీడియా ట్రోల్లర్స్ ని “బతకండి రా అంటూ” వాళ్ళకి లైఫ్ ఇస్తూ ఉంటుంది మంచు లక్ష్మి.
మనం నిజంగా మాట్లాడుకుంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గారికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే ఆయన కంటూ ఒక సపరేట్ మార్కెట్ కూడా ఉంది.ఒకప్పుడు ఆయన్ని కలెక్షన్ కింగ్ అని పిలుచుకునే వాళ్ళం.
కానీ ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ టైం అసలు బాలేదని చెప్పొచ్చు.మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మెహన్ బాబు వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడిన ఇప్పుడున్న సోషల్ మీడియా వాళ్ళని ట్రోల్ చేస్తుంది.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే.వాళ్ళు మొదటి నుండి అలాగే మాట్లాడేవారు.
అది వాళ్ళ నైజం….కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందడం వలన వాళ్ళని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
కానీ ఇటీవలే మంచు లక్ష్మి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి… ఒకం ప్రముఖ ఛానల్ చేసిన ఒక ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి కి చిన్నప్పుడు హిందీ, ఇంగ్లీష్ నేర్పించిన మాస్టర్ వచ్చారు.ఆయన ఆ ఇంటర్వ్యూ లో లక్ష్మి గురించి మాట్లాడుతూ… లక్ష్మి 8వ తరగతిలో ఉన్నప్పుడే ఇంగ్లీషులో రాయడం కానీ, మాట్లాడ్డం కానీ ఇరగతిసేదని.ఒకరోజు లక్ష్మి రాసిన ఇంగ్లీష్ ఎక్సమ్ పేపర్ చూసి నేను ఆశ్చర్యపోయానని…తనకే తెలియని కొన్ని ఇంగ్లీష్ పదాలు ఆ పేపర్ లో చూసానని.అసలు ఎక్కడ పబ్లిష్ కానీ ఆ మ్యాటర్ అంత చిన్న వయసులో లక్ష్మి ఎలా రాసిందో అని కంగుతిన్నట్టుగా చెప్పారు.
అయితే లక్ష్మి రాసిన ఆ ఎగ్జాం పేపర్ ని స్కూల్ వాళ్ళు ఫారెన్ పంపిస్తే…ఆ పేపర్ చూసిన ఫారినర్స్ అందరూ షాక్ అయి లక్ష్మీని, మోహనబాబు గారిని, వాళ్ళ అమ్మ గారిని ఫారెన్ పిలిపించుకొని మరి సత్కరించారట.ఇంగ్లీష్ వాళ్ళకే ఇంగ్లీష్ నేర్పింది అని కూడా వాళ్ళు పొగిడినట్టు మాస్టర్ గారు ఆ ఇంటర్వ్యూ లో తెలియజేసారు.సో, చిన్నప్పటి నుండే ఇంగ్లీషులో పుట్టి పెరగడం, ఇంగ్లీషులో లోనే ఎక్కువగా మాట్లాడ్డం వలన తను తెలుగు మాట్లాడిన ఇంగ్లీషు లా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాదు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు ఎక్కడ కనిపించినా… ఎప్పుడో చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుగారు అనే భక్తి ఉండబట్టి ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించిన నా కాళ్ళకి నమస్కారం చేస్తారు అని అది వాళ్ళ సంస్కారం అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా మోహన్ బాబు గారు వాళ్ళకి చిన్నప్పుడే… రామాయణం, మహాభారతం కథలను బోధించమన్నాడని కూడా ఆయన చెప్పుకొచ్చారు.