ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తున్నాయి.ఇలాంటి వర్షాల్లోనూ కొంతమంది తమ పనులు కొనసాగిస్తూ అందరి చేత హీరో అనిపించుకుంటున్నారు.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లోనూ( Ahmedabad ) భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.అక్కడి రోడ్లు అన్నీ నీట మునిగిపోయిన సమయంలో ఒక జొమాటో డెలివరీ ఏజెంట్( Zomato Delivery Agent ) ఫుడ్ డెలివరీ చేశాడు.
కాళ్ళ వరకు వరద నీళ్లు అతడిని ముంచేసిన ఆ నీళ్ళలో నడుస్తూ ఆర్డర్‌ను డెలివర్ చేశాడు.అతనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఏజెంట్ అద్భుతమైన కృషిని చూసి చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.ముఖ్యంగా, జొమాటో కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్‌ను( Deepinder Goyal ) ఈ ఏజెంట్‌కు ప్రత్యేకంగా బహుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జోమాటో కంపెనీ( Zomato ) కూడా ఆ ఏజెంట్‌ని గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది.అందుకే ఆ ఏజెంట్ గురించి మరిన్ని వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరుతోంది.
అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురిసి రోడ్లు అన్నీ నీళ్లతో నిండిపోగా ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ధైర్యం చేయడం లేదు.కానీ, ఈ జొమాటో డెలివరీ బాయ్ మాత్రం ఆ నీళ్ళలో నడుస్తూ, ఆర్డర్ చేసిన ఆహారాన్ని తెచ్చి ఇవ్వడానికి ప్రాణాలను పరంగా పెట్టాడు.
వీడియోలో ఏముందంటే, ఒక వ్యక్తి ఈ డెలివరీ బాయ్ ని వీడియో తీస్తున్నాడు.చాలా ప్రమాదకరమైన వరదల్లో ఈ డెలివరీ బాయ్ ఎంతో ధైర్యంగా తన పని చేస్తున్నాడని తెలిసి అబ్బురపడ్డాడు.ఆ వీడియో రికార్డు చేసిన వ్యక్తి, “ఈ వర్షంలో కూడా ఆర్డర్లు డెలివర్ చేస్తున్న జోమాటో వాళ్ళకు ఈ డెలివరీ మనిషికి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
“మీరు మా డెలివరీ బాయ్ గొప్ప పనిని అందరికీ తెలియజేశారు.అతను చాలా కష్టపడి, ప్రమాదకరమైన వాతావరణంలో కూడా ఆర్డర్‌లు చేరవేస్తున్నాడు.అతనికి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం.దీని కోసం, ఆ ఆర్డర్‌కు సంబంధించిన నంబర్ లేదా ఆ డెలివరీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో చెప్పగలరా? అప్పుడు మేం అతన్ని సరిగ్గా గుర్తించి, బహుమతి ఇవ్వగలం” అని జొమాటో కంపెనీ అడిగింది.ఈ వీడియో పోస్ట్ కు చాలా వ్యూస్ వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసేయండి.