నీటిలో నానుతున్న విజయవాడ.. బ్రహ్మం గారి కాలజ్ఞానం పైనే చర్చ 

గత కొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.ముఖ్యంగా విజయవాడ నగరం లో రోడ్లన్నీ నీట మునిగాయి.

 Heavy Flood In Vijayawada , Vijayawada, Bezavada, Rain Effect, Budameru Cannal,-TeluguStop.com

  గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడంతో,  నదులు ప్రాజెక్టులు నిండిపోయి విజయవాడ ను నీళ్లతో నింపేసాయి.  ముఖ్యంగా బుడమేరు వాగు వెనక్కి ప్రవహిస్తుండడంతో ఆ సమీప ప్రాంతాల్లోని నివాస గృహాలు చాలావరకు ముంపు లోనే ఉన్నాయి.

  .  వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు.గతం లో ఎప్పుడూ లేనివిధంగా విజయవాడ ను వరద నీరు ముంచెత్తడంతో భారీ నష్టమే జరిగింది .గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా విజయవాడ ముంపుకు గురైంది.విజయవాడ ( Vijayawada )చుట్టుపక్కల ఉన్న వాగులన్నీ పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచేశాయి.

Telugu Andhrapradesh, Bezavada, Budameru Cannal, Heavy, Kalagnanam, Effect, Veer

 నగరంలో ఎక్కడ చూసినా వరద నీదే దర్శనమిస్తుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు .వేలాది మోటార్ సైకిళ్ళు , కార్లు సైతం ఇంకా నీట మునిగే ఉన్నాయి.  ప్రజలు నిత్యవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి .ఇప్పటికే వేలాది మందిని పునరవాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేశారు.ఇంకా కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు మరింతగా కంగారు పడుతున్నారు.  జాతీయ రహదారుల పైకి నీరు పూర్తిగా చేరుకోవడంతో చాలావరకు రాకపోకలు స్తంభించాయి .తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి .

Telugu Andhrapradesh, Bezavada, Budameru Cannal, Heavy, Kalagnanam, Effect, Veer

ఆర్టీసీ బస్సులు,  రైళ్ల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది.  దీంతో చాలామంది ప్రయాణికులు మార్గమధ్యంలోనే నిలిచిపోయారు.ఇదిలా ఉంటే .బెజవాడ గతంలో ఎప్పుడు లేని విధంగా ముంపునకు గురవడంతో వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం( Kalagnanam ) నిజం అవుతుందా అనే చర్చ మొదలైంది.  పోతులూరి వీరబ్రహ్మం స్వామి చెప్పినట్లుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి( Vijayawada Kanaka Durgamma ) ముక్కుపుడకను వరదనీరు తాకుతుందని కాలజ్ఞానంలో ప్రస్తావించారని ,  ఇప్పుడు పరిస్థితి చూస్తే అది నిజమయ్యేట్టు ఉందనే చర్చ జనాల్లో మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube