ప్రస్తుతం కరోనా వైరస్ కంటికి కనిపించకుండా వేగంగా విజృంభిస్తోంది.ఎటు నుంచి దాడి చేస్తుందో కూడా తెలియని ప్రజలు.
ఈ మహమ్మారి కోరల్లో పడి నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే కరోనా భూతం నుంచి రక్షించుకోవాలన్నా.
పోరాడాలన్నా.రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతున్నారు.అయితే రోగనిరోధక శక్తి పెంచడంలో ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయి.రోగనిరోధక శక్తిని పెంచే విటమిస్ సి, విటమిన్ బి2, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు ఓట్స్‌లో సమృద్ధిగా ఉన్నాయి.
అందుకే ఈ కరోనా టైంలో ఖచ్చితంగా డైలీడైట్‌లో ఓట్స్ చేర్చుకోమని నిపుణులు చెబుతున్నారు.ఇక ఇమ్యూనిటీ పెంచడమే కాదు.ఓట్స్‌తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మధుమేహం రోగులు ప్రతిరోజు ఓట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి.అలాగే ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్.శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
ఇక రక్తపోటును అదుపు చేయడంలోనూ, క్యాన్సర్ వంటి భయంకర సమస్యల నుంచి రక్షించడంలోనూ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఓట్స్ ఉపయోగపడతాయి.కాబట్టి, ఓట్స్‌ను ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.