మెంతులు( fenugreek ) చేదుగా ఉన్నా కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ముఖంపై ముదురు రంగు మచ్చలను మాయం చేయడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.
మరి ఇంతకీ మచ్చలేని చర్మాన్ని పొందడం కోసం మెంతులను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు మరియు అరకప్పు హాట్ వాటర్( Half a cup of hot water ) వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పల్చటి క్లాత్ లో వేసుకుని స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మెంతుల క్రీమ్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloe vera gel ) వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil
)మరియు హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే ఒక న్యాచురల్ ఫేస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజులపాటు వాడుకోవచ్చు.రోజు నైట్ నిద్రించేముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.
స్పాట్స్ అన్ని దూరం అవుతాయి.క్లియర్ అండ్ స్మూత్ స్కిన్ మీ సొంతమవుతుంది.
అలాగే ఈ న్యాచురల్ క్రీమ్ మొటిమలు బెడదను తగ్గిస్తుంది.చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
ముడతలు, చారలు వంటి వృద్ధాప్య లక్షణాలను సైతం ఆలస్యం చేస్తుంది.కాబట్టి మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ క్రీమ్‌ను ప్రయత్నించండి.