కలబంద( Alo vera ).ఎన్నో ఔషధ గుణాలు గల ఒక అమూల్యమైన మొక్క.
ఆయుర్వేద మందులు, క్రీములు, షాంపూలు, లోషన్లు, సబ్బులు, మాయిశ్చరైజర్లు, ఫేస్ వాష్ మరియు ఇతర ఉత్పత్తుల తయారీలో కలబంద విసృతంగా ఉపయోగించబడుతోంది.మనలో చాలా మంది తమ పెరటిలో కలబంద మొక్కను పెంచుతుంటారు.
కొందరైతే ఇంటి లోపల కూడా కలబంద మొక్కను పెట్టుకుంటారు.ఆరోగ్య పరంగా, అందం పరంగా మరియు వాస్తు పరంగా కలబంద ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ముఖ్యంగా ఇంటి లోపల కలబంద మొక్కను చిన్న చిన్న కుండీల్లో పెట్టి పెంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.వాయు శుద్దీకరణ లక్షణాలను కలబంద కలిగి ఉంది.
ఇంటి లోపల కలబంద మొక్కను పెంచడం వల్ల అది గాలి నుండి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.ఆక్సిజన్ ( Oxygen )ను విడుదల చేస్తుంది.
అలాగే కలబంద మొక్క ఇంట్లో తేమను సమతుల్యం చేస్తుంది.మంచి ఫ్రెష్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేస్తుంది.

వాస్తు పరంగా.ఇంట్లో కలబంద మొక్కని పెంచడం వల్ల సంపద మరియు ప్రశాంతతను తీసుకువస్తుందని నమ్ముతారు.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుందని అంటారు.శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతారు.అలాగే ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆరోగ్యానికి, చర్మానికి( health and skin ) రక్షణ కవచం ఉన్నట్లే.అవును, చర్మానికి ఫ్రెస్ కలబంద గుజ్జును రెగ్యులర్ గా రాయడం వల్ల మొటిమలు, ముదురు రంగు మచ్చలు మాయం అవుతాయి.
చర్మం ఆరోగ్యంగా, తేమగా మారుతుంది.

ఏమైనా గాయాలు అయినప్పుడు.వంట చేసేటప్పుడు బర్న్స్ కు గురైనప్పుడు కలబంద జెల్ ను రాస్తే నొప్పి నుంచి ఉపశమనంతో పాటు ఆయా గాయాలు, బర్న్స్ త్వరగా నయం అవుతాయి.అంతేకాకుండా కలబందతో జ్యూస్ చేసుకుని అప్పుడప్పుడు తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణ సమస్యలకు కూడా కలబంద జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.