వేసవి కాలం వస్తూ వస్తూనే తనతో పాటు ఎన్నో రోగాలను తీసుకువస్తుంది.అందుకే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతుంటారు.
అయితే వేసవిలో ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల గింజలను నీటిలో నానబెట్టుకుని తింటే మస్తు లాభాలను పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గింజలు ఏంటీ.? వాటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
అవిసె గింజలు.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఇవి అంత రుచిగా ఏమీ ఉండకపోయినా.బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.
ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా ఒక స్పూన్ అవిసె గింజలను నీటిలో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే.
వెయిట్ లాస్ అవుతారు.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
మెదడు చురుగ్గా మారుతుంది.మరియు నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే రెండొవది మెంతులు.ఇవి చెదుగా ఉన్నా.హెల్త్‌కు చాలా మేలు చేస్తాయి.ఒక అర స్పూన్ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మూత్రపిండాల పని తీరు మెరుగుపడుతుంది.మరియు మోకాళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందొచ్చు.

ఇక చివరిది గసగసాలు.వారంలో రెండంటే రెండు సార్లు అర స్పూన్ల గసగసాలను వాటర్‌లో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడపుతో తినేస్తే.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.వేడి వల్ల వచ్చే నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.మహిళల్లో సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది.
మరియు నిద్రలేమి సమస్య సైతం పరార్ అవుతుంది.