కారులో నుంచి ఎలుగుబంటి, దాని పిల్లలు ఏం కొట్టేశాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

అమెరికా( America ) దేశం, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రం, బార్ట్‌లెట్‌ అనే చిన్న పట్టణంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.అక్కడ ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి కారులోకి దూకి చిప్స్ బ్యాగ్ దొంగతనం చేసింది! అవును, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించినా నిజం.

 If You Know What The Bear And Its Cubs Hit From The Car.. You Will Be Surprised-TeluguStop.com

అడవి జంతువు అయిన ఎలుగుబంటి ( bear )ఒక కారులోకి వెళ్లి మనిషి తినే చిప్స్( Chips) దొంగతనం చేసింది.

Telugu America, Bear Chips, Hampshire, Wildlife-Telugu NRI

ఇంతకీ ఇది ఎలా జరిగిందంటే, కారు కిటికీ కొంచెం తెరిచి ఉంది.దాన్ని తల్లి ఎలుగుబంటి చూసింది.వెంటనే తన పిల్లలతో కలిసి ఆ కిటికీ గుండా కారులోకి దూకింది.

ఆ తర్వాత కారులో ఉన్న చిప్స్ బ్యాగ్‌ను పట్టుకుని వెళ్లిపోయింది.ఈ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది కదా! ఈ విచిత్ర సంఘటనను ఒక టీవీ ఛానెల్ కెమెరాలో బంధించింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతుంది.మనుషులే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి తెలివైన దొంగలు ఉంటాయా అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.

Telugu America, Bear Chips, Hampshire, Wildlife-Telugu NRI

కారులోంచి చిప్స్ బ్యాగ్ తీసుకున్న ఆ తల్లి ఎలుగుబంటి( Bear) తన పిల్లల దగ్గరికి వెళ్లింది.తాను దొంగతనం చేసిన ఆహారాన్ని తన పిల్లలతో పంచుకుంది.న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఒక కారణం ఉందని చెప్పారు.సాధారణంగా ఎలుగుబంట్లు చాలా తెలివైన జంతువులు.అవి ఎక్కడైనా సరే ఆహారం కనిపించిందంటే చాలు దాని వెంట పరుగులు తీస్తాయి.అంటే, అడవిలో తినడానికి చిన్న చిన్న పురుగులు, కాయగూరలు లేకపోతే అవి మనుషుల ఇళ్ల దగ్గరకు వచ్చి ఆహారం కోసం వెతుకుతాయి.

ఈ ఎలుగుబంటి ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు.కేవలం ఆ కారు యజమాని మళ్ళీ ఒక చిప్స్ బ్యాగ్ కొనవలసి వచ్చింది.

కానీ, ఇలాంటి సంఘటనల్లో కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడతాయి.ఎలుగుబంట్లు మనుషులను కొరకడం లేదా ఇళ్లను దెబ్బతీయడం లాంటివి చేయవచ్చు.

ఈ https://youtu.be/LXbO2QL6qY8?si=_QYk4CR5Bvv1gIfh లింక్ పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube