టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలయ్య రేర్ గా ఇంటర్వ్యూలు ఇచ్చినా ఆ ఇంటర్వ్యూలలో చెప్పే విషయాలు మాత్రం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంటాయి.
చరణ్ ,అల్లు అర్జున్ ( Charan, Allu Arjun )నాకు చాలా క్లోజ్ అని బాలయ్య చెప్పుకొచ్చారు.తరచుగా కలవడం కుదరకపోయినా మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని బాలయ్య కామెంట్లు చేశారు.
పిల్లలు ఎదుగుతుంటే ఆనందంగా ఉంటుందని చెబుతూ బాలయ్య చరణ్, బన్నీపేర్లను ప్రస్తావించడం జరిగింది.బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోకు ఇప్పటికే అల్లు అర్జున్ హాజరు కాగా రాబోయే రోజుల్లో చిరంజీవి, చరణ్ కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
మరోవైపు బాబీ సినిమా( Bobby movie ) షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా బాలయ్య ఇచ్చేశారు.
పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ కావడం వల్ల దాదాపుగా మూడున్నర నెలలు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చిందని బాలయ్య చెప్పుకొచ్చారు.బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.జైపూర్ లో తాజాగా మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేశామని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఈ సినిమా టైటిల్ అప్ డేట్ కూడా త్వరలో రానుంది.
బాలయ్య బాబీ కాంబో మూవీ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా ఒకింత భారీ సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య బాబీ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం రిలీజ్ కానుందని తెలుస్తోంది.
బాలయ్య బాబీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని భోగట్టా.