దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు( K.
Raghavendra Rao ) 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి భారతీయ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.సినిమా దర్శకులలో రాఘవేంద్రరావు గొప్పైతే సంగీత దర్శకుల లో కీరవాణి గొప్ప అని చెప్పుకోవచ్చు.
కీరవాణి( Keeravani ) కొట్టిన సంగీతం తెలుగు సినిమా పరిశ్రమను మరో స్థాయిలో నిలబెట్టింది.కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ ఆస్కార్ అవార్డు కూడా గెలిచింది.
ఈ దిగ్గజ సినిమా సెలబ్రిటీలు కలిసి మొత్తం 23 సినిమాలు చేశారు.‘అల్లరి మొగుడు’ సినిమా నుంచి వీళ్ల కాంబినేషన్ మొదలయ్యింది.
‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా వరకు వీరి కాంబో కంటిన్యూ అయ్యింది.అయితే కొన్నిసార్లు వేరు ఒకరికొకరు పోట్లాడుకున్నారట.

“మధ్యవర్తుల కారణంగా రాఘవేంద్రరావు, నా మధ్య విభేదాలు వచ్చాయి.మధ్యవర్తులు కొన్నిసార్లు సామ్రాజ్యాలు కలిసి పోవడానికి కారణం అవుతారు.మరికొన్నిసార్లు సామ్రాజ్యాలు కూలిపోవడానికి దారి తీస్తారు.మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది.సాధారణంగా కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనస్పర్ధలు రావడం సహజం.వారి బంధం చివరి వరకు ఉండాలంటే ఎవరిలో ఒకరిలో ఓపిక, సహనం అనేది ఉండాలి.
అలాంటి లక్షణాలు రాఘవేందర్రావులో ఉన్నాయి.ఆయన చాలా మెచ్యూర్, కూల్ పర్సన్.
మేం మధ్యవర్తులను అవాయిడ్ చేసినంత సేపు చాలా హ్యాపీగా ఉన్నాం.రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మా మధ్య పరిచయం ఏర్పడింది.
దానికి రాఘవేంద్రరావే నిర్మాత.ఈ సమయం నుంచి మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు.మిడిల్ మ్యాన్ మా మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నించినా సరే మేము చివరి వరకు మంచిగానే ఉన్నాం.” అని కీరవాణి వెల్లడించారు.

కీరవాణి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.కీరవాణి ప్రస్తుతం విశ్వంభర, హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.ఈ దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ తన కెరీర్‌లో క్షణ క్షణం, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, క్రిమినల్, శుభ సంకల్పం, పెళ్లి సందడి, దేవరాగం, అన్నమయ్య, స్టూడెంట్ నెం.1, శ్రీరామదాసు, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ వంటి వాటికి మ్యూజిక్ కంపోజ్ చేశారు.