ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. క్రేజీ సినిమాలే ఈ జాబితాలో ఉన్నాయిగా!

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లో ఓటీటీలో విడుదల కావడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయానికి వస్తే.

 Upcoming Telugu Movies September First Week, Up Coming Movies, September , First-TeluguStop.com

తమిళ్ హీరో విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం( The Greatest of All Time ) అనే సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఏజీఎస్‌ పతాకంపై నిర్మించారు.

అదేవిధంగా నివేదా థామస్‌, విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 35 చిన్న కథ కాదు.

Telugu September, Greast Time-Movie

నందకిశోర్‌ ఇమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.రానా నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న విడుదల కానుంది.

ఇందులో నివేదా తల్లి పాత్ర పోషించింది.అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం జనక అయితే గనక( Janaka Aithe Ganaka ).సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ రాజేంద్రప్రసాద్ లాంటి వారు ముఖ్యపాత్రల్లో నటించారు.కాగా ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి.ఇకపోతే ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు, సిరీస్‌ల విషయానికి వస్తే.

Telugu September, Greast Time-Movie

బ్రిక్‌ టూన్స్‌ అనే ఇంగ్లీష్‌ మూవీ సెప్టెంబరు 4 డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది.అలాగే కిల్‌ అనే హిందీ మూవీ సెప్టెంబరు 6 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది.ఇకపోతే సోనీ లివ్ లో ప్రసారమయ్యే సినిమాల విషయానికొస్తే.తానవ్‌ 2 అనే హిందీ మూవీ సెప్టెంబరు 6 న విడుదల కానుంది.నెట్‌ఫ్లిక్స్‌ విడుదల అయ్యే సినిమాల విషయానికి వస్తే.అపోలో 13: సర్వైవల్‌ అనే డాక్యుమెంటరీ సెప్టెంబరు 05 స్ట్రీమింగ్ కానుంది.అలాగే ది పర్‌ఫెక్ట్‌ కపుల్‌ ఇంగ్లీష్‌ మూవీ సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ కానుంది.బ్యాడ్‌బాయ్స్‌: రైడ్ ఆర్‌ డై అనే ఇంగ్లీష్‌ మూవీ సెప్టెంబరు 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.రెబల్‌ రిడ్జ్ అనే ఇంగ్లీష్‌ మూవీ సెప్టెంబరు 06 నుంఛీ స్ట్రీమింగ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube