తుమ్ము.దీని గురించి పరిచయాలు అవసరమే లేదు.ఎందుకంటే, తుమ్ము తెలియని వారు.తుమ్మని వారు ఉండనే ఉండరు.రుతువులు మారినా, జలుబు చేసినా, నీరు మారినా, గాలిలో మార్పులు వచ్చినా, దుమ్ము, ధూళి ముక్కులో చేరినా తుమ్ములు వస్తూ ఉంటాయి.రెండు, మూడు సార్లు తుమ్ములు వస్తే పెద్ద ఇబ్బందేమి ఉండదు.
కానీ, ఒక్కో సారి నాన్ స్టాప్‌గా తుమ్ములు వస్తూనే ఉంటాయి.దీని వల్ల మనకు చికాకు రావడమే కాదు.
పక్కని వారికి ఇబ్బందిగానూ ఉంటుంది.
ఇక ఆ సమయంలో తుమ్ములు ఆపుకోవడం ఎలానో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే సులువుగా తుమ్ములకు చెక పెట్టవచ్చు.విపరీతమైన తుమ్ములకు చెక్ పెట్టడంలో దాల్చిన చెక్క అద్భుతంగా సహాయపడుతుంది.అర స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే.తుమ్ములు క్షణాల్లోనే తగ్గుముఖం పడతాయి.

తుమ్ములను నివారించడంలో అల్లం కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్‌లో క్రాష్ చేసిన అల్లంను వేసి బాగా మరిగించాలి.అనంతరం ఆ వాటర్‌ను వడగట్టుకుని.కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా చేస్తే తుమ్ములు తగ్గడంతో పాటుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
అలాగే మెంతులు, మిరియాలు, వాము మూడిటిని పొడి చేసి.
కొద్దిగా తేనె కలిపి అర స్పూన్ చప్పున తీసుకోవాలి.ఇలా చేస్తే.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శ్వాసమార్గంలో కఫం చేరుకోకుండా చేయడంతో పాటు వైరస్ ఊపిరితిత్తుల్లో తిష్ట వేయకుండా శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది.ఫలితంగా తుమ్ముల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మరియు ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరిగి.సీజనల్ రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.