చుండ్రును తరిమికొట్టే దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

చుండ్రు( dandruff ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.చుండ్రు అనేది పెద్ద సమస్య కానప్పటికీ చాలామందిని ఇది తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంటుంది.

 How To Use Cinnamon For Dandruff Relief! Cinnamon, Cinnamon Benefits, Cinnamon F-TeluguStop.com

అధిక శాతం మందిలో మాలాసిజియా గ్లోబోసా అనే ఫంగస్ కారణంగా చుండ్రు సమస్య తలెత్తుతుంది.ఈ ఫంగస్ చర్మం, వెంట్రుకల్లో సహజంగా ఉన్న నూనెను పీల్చేసుకుంటుంది.

అదే సమయంలో ఒక రకమైన యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది.దీని వల్ల తలలో దురద, పొక్కులు రావడం జరుగుతుంది.

Telugu Cinnamon, Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Healthy, Healthy Sc

అలాగే చుండ్రు కారణంగా జుట్టు కుదుళ్ళు బలహీన పడతాయి.హెయిర్ ఫాల్( Hair fall ) అధికమవుతుంది.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు.అయితే కొందరు ఎంత ఖరీదైన షాంపూను వాడినా కూడా చుండ్రు నుండి బయటపడలేక పోతుంటారు.అలాంటివారికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది.దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మెండుగా ఉంటాయి.

అందువల్ల దాల్చిన చెక్క ను ఉపయోగించి చుండ్రును సులభంగా వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

Telugu Cinnamon, Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Healthy, Healthy Sc

ముందుగా మిక్సీ జార్ లో దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

కనీసం పదినిమిషాల పాటు మసాజ్ చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి కనుక చేశారంటే చుండ్రు అన్న మాటే అనరు.ఈ సింపుల్ రెమెడీ చుండ్రును సమర్థవంతంగా దూరం చేస్తుంది.

స్కాల్ప్ ను డీటాక్స్ చేసి హెల్తీ గా మారుస్తుంది.అదే సమయంలో తలలో రక్త ప్రసరణ మెరుగు పడేలా ప్రోత్సహిస్తుంది.

ఫలితంగా జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీ ని ఫాలో అవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube