దక్షిణాసియా వ్యాపారవేత్తలే టార్గెట్‌ : కెనడా పోలీసుల అదుపులో ఆరుగురు పంజాబీ యువకులు

ఎడ్మంటన్ ప్రాంతంలోని దక్షిణాసియా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లను కట్టడి చేసేందుకు కెనడా పోలీసులు స్పెషల్ ఆపరేషన్‌ చేపట్టారు.దీనిలో భాగంగా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.

 Six Punjabi Youths Arrested In Canada For Extortion Targeting South Asian Busine-TeluguStop.com

‘ ప్రాజెక్ట్ గ్యాస్‌లైట్’గా పిలుస్తున్న ఈ దోపిడీ గ్యాంగ్‌లోని ఏడవ నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్లు జారీ చేశారు.అరెస్ట్ అయినవారంతా భారత మూలాలున్న వారే కావడం గమనార్హం.

నిందితులను జషన్‌దీప్ కౌర్ (19), గుర్కరణ్ సింగ్ (19) , మానవ్ హీర్ (19), పర్మీందర్ సింగ్ (21), దివ్నూర్ అష్త్ (19), 17 ఏళ్ల మైనర్.మొత్తం ఏడుగురు నిందితులు 54 అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

Telugu Canada, Edmonton, Manindersingh, Punjabi, Asian Owners-Telugu NRI

ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్)( Edmonton police ) ప్రస్తుతం ఈ దోపిడిలకు సంబంధించి 40 ఘటనలపై పరిశోధిస్తోంది.ఇటివల కవానాగ్ పరిసరాల్లోని అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదానికి కూడా ఈ ఘటనలతో కనెక్షన్ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.జూలై 25న ఈపీఎస్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు ఎడ్మంటన్‌లోని ఆరు ప్రదేశాలలో సెర్చ్ వారెంట్‌లను అమలు చేశారు.

Telugu Canada, Edmonton, Manindersingh, Punjabi, Asian Owners-Telugu NRI

ఈ సందర్భంగా వ్యాపారులను దోపిడీ చేసిన గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు పురుషులు, ఒక స్త్రీని అరెస్ట్ చేశారు.దోపిడీలకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌లీడర్ మణిందర్ సింగ్ ధాలివాల్ (34)( Maninder Singh Dhaliwal )పై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.ధాలివాల్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

కెనడాలో స్థిరపడిన దక్షిణాసియా దేశాల తల్లిదండ్రులు.దోపిడీలు, కాల్పుల ఘటనల నేపథ్యంలో తమ పిల్లలతో మాట్లాడాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

కాగా.భారతీయ, దక్షిణాసియా బిజినెస్ కమ్యూనిటీలను టార్గెట్ చేస్తూ దోపిడీ , బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువ కావడంతో ఈ ఏడాది ప్రారంభంలో బ్రాంప్టన్, సర్రేలోని మేయర్లు అప్రమత్తమయ్యారు.

ఈ ముప్పును నిర్మూలించడానికి వేగవంతమైన చర్య తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్, సర్రే మేయర్ బ్రెండా లాక్‌లు.

కెనడా ప్రజా భద్రత మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌కు రాసిన లేఖలో దోపిడీ యత్నాలు, కాల్పులు సహా ఇతర హింసాత్మక చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube