జిల్లా వ్యాప్తంగా పోలీస్ నాఖా భంది నిర్వహణ

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ( District SP Sunpreet Singh )ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు అన్ని ముఖ్య పట్టణాలు, ప్రధాన చెక్ పోస్టులు, మండల కేంద్రాల్లో పోలీసులు నాఖా భంది కార్యక్రమాలు నిర్వహించి వాహనాల తనిఖీలు చేశారు.దీనిలో భాగంగా సరైన అనుమతి పత్రాలు లేని 156 వాహనాలు సీజ్ చేశారు.

 Maintenance Of Police Nakha Bhandi Across The District , District Sp Sunpreet S-TeluguStop.com

డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మందుబాబులపై చర్యలు తీసుకున్నారు.నెంబర్ ప్లేట్ లేని వాహనదారులపై చలానాలు విధించి ఖచ్చితంగా నంబర్ ప్లేట్ ఉండాలని సూచించారు.

అనుమానం ఉన్న వ్యక్తుల యొక్క వివరాలు నమోదు చేసి పాత నేరస్తుల డాటా బెస్ నందు తనిఖీ చేశారు.డ్రగ్స్ రవాణాను గుర్తించడానికి నార్కోటిక్ పదార్ధాలు గుర్తించే త్రైనుడ్ డాగ్ రోలెక్స్ ను ఉపయోగించి తనిఖీలు చేశారు.

ఈ సందర్బంగా సూర్యాపేట,కోదాడ సబ్ డివిజనల్ పరిధిలో నాఖ భాంది కార్యక్రమాన్ని డిఎస్పీలు పర్యవేక్షణ చేశారు.

జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసు నాఖా భంది కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

దీని వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి దొంగతనాలు అరికట్టవచ్చని,పాత నేరస్తులు,దొంగల సంచారం అరికట్టవచ్చని, అక్రమ రవాణాను, నేరాలను అడ్డుకోవడం వీలౌతుందని,ప్రజలకు మరింత భరోసా కల్పించవచ్చన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube