లక్ష్యంతో చదివితే విజయం తధ్యం:మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు,నిధులు,నియామకాలలో భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని,ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.తన మాతృమూర్తి గుంటకండ్ల సావితమ్మ జ్ఞాపకార్థం మంత్రి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఛైర్మన్ గా కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఎస్.

 Success Is The Key To Success: Minister Jagadish Reddy-TeluguStop.com

ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఆయా విభాగాలలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకున్న యువతీ,యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్ ఫౌండేషన్ తరపున ముఖ్యాతిథిగా హాజరైన మంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ లక్ష్యంతో చదివితే విజయం తధ్యమని అన్నారు.చదువు జీవితానికి వెలుగు వంటిదన్న మంత్రి,317 జీవో తెచ్చింది కేవలం నిరుద్యోగ యువతకు లాభం చేకూర్చడం కోసమే అన్నారు.

విద్యార్థులకు కావల్సిన పద్దతుల్లో తగిన వసతులతో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఎస్ ఫౌండేషన్ సిబ్బంది,అధ్యాపకులు సర్వ సన్నద్ధంగా ఉన్నారన్నారు.ఉచిత శిక్షణను విద్యార్ధులు సద్వినియోగం చేసుకుని అధికంగా ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు.

ప్రిపరేషన్ లో ఏమి చేయాలో ఏమి చెయకూడదో అనుభవ అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలని యువతకు సూచించారు.ప్రణాళిక బద్దంగా చదివితే ఉద్యోగం వరించడం ఖాయమని,శిక్షణ తరగతుల అవగాహన సదస్సుకు వచ్చిన 1700 మందికి పైగా యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు.

తాను కూడా శిక్షణ సందర్భంలో తరచుగా శిక్షణ తరగతులకు హాజరవుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ సీఈవో వీరయ్య,అధ్యాపకులు కొండల్,కో ఆర్డనేటర్ కీసర వేణు గోపాల్ రెడ్డి,ముదిరెడ్డి అనీల్ రెడ్డి,కొమ్ము ప్రవీణ్,దేశగాని శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube