సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డిఎస్పీ రవిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబం సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట డీఎస్పీ రవి,
తుంగతుర్తి సిఐ శీనుపై బదిలీ వేటు పడగా,ఎస్ఐకి మెమో జారీ చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో టాక్.
లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఐజి సత్యనారాయణ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తారని తెలుస్తోంది.