తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రామలింగేశ్వర థియేటర్ ప్రాంతం మీదుగా మంత్రి కాన్వాయ్ వెళ్తోంది.
మంత్రి జగదీశ్ రెడ్డిని చూసిన ఓ టైలర్ పరుగున వెళ్లి కాన్వాయ్ ను ఆపాలని కోరారు.టైలర్ దేవేంద్ర చారిని చూసిన మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ ను ఆపారు.
ఈ క్రమంలో టైలర్ తాను మంత్రికి పెద్ద అభిమానినని, తనకు అనుమతిస్తే ఉడతా భక్తిగా బట్టలు కుట్టి ఇస్తానని కోరాడు.దీనికి సమ్మతించిన మంత్రి జగదీశ్ రెడ్డి టైలర్ షాపుకు వెళ్లి కొలతలు ఇచ్చారు.
దీంతో టైలర్ దేవేంద్ర చారి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.