సూర్యాపేట జిల్లా:అసలే పేదరికం,ఆపై అనుకోని ఆపద వెరసి ఓ అభాగ్యురాలి ప్రాణాల మీదకు వచ్చిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో వెలుగు చూసింది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సిరికొండ గ్రామానికి చెందిన జిల్లా వీరమ్మ గ్రామంలోని కూలీనాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది.
డిసెంబర్ 30వ, తేదిన పెద్ద కుమారుడు పిల్లలతో కలసి పిల్లలమర్రి నుంచి బైకుపై వస్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ కు బలంగా ఢీ కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయంతో పాటు దవడ రెండు వైపులా ఉన్న ఎముకలు విరిగాయి.పొట్టకు కూడా బలమైన గాయాలయ్యాయి.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వెంటిలేషన్ మీదనే వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.వారి వద్ద ఉన్న కొద్దో గొప్పో డబ్బులతో వైద్యం చేయించగా ప్రస్తుతం చికిత్స కొనసాగించే అవకాశం లేకుండా పోయింది.
రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి అనుకొని రోడ్డు ప్రమాదం పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది.రూ.6 లక్షలు ఖర్చు చేస్తేనే ప్రాణాలు దక్కే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితి పడింది.ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.ప్రస్తుతం వారి వద్ద చిల్లి గవ్వ కూడా లేకపోవడంటి రూ.6 లక్షలకు పైగా ఖర్చుఅవుతాయని వైద్యులు చెప్పడం,ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో ఎవరైనా ఆదుకోక పోతారా అని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థలు, దాతలు,మానవతావాదులు, యువకులు తమకు తోచిన విధంగా సాయం చేసి,ఒక నిరుపేద నుండి ప్రాణాలు కాపాడుటకు దయార్థ హృదయంతో సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.వీరమ్మ కుమారుడు జిల్లా వీరబాబు ఫోన్ పే నంబర్ (6303328720),బ్యాంకు అకౌంట్ నెంబరు (33333470214) కు తోచిన సాయం అందించాలని వేడుకుంటున్నారు
.