నెలవారీ పోలీసు సమీక్షా సమావేశం

సూర్యాపేట జిల్లా:రోడ్డు భద్రత,హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించి,రోడ్డు భద్రత,హెల్మెట్ వినియోగంపై అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు.

 Monthly Police Review Meeting-TeluguStop.com

అనంతరం జిల్లాలో బందోబస్తు విధులు,ఇతర జిల్లాలో సీఎం బందోబస్తు,జిల్లా కమ్యూనిటీ పోలీసింగ్,కోర్టు డ్యూటీ,సమన్స్,వారెంట్ లు అందజేత,టెక్ టీమ్,లోక్ అదాలత్,కమ్యునికేషన్ వర్టికల్ పని విభాగాల్లో బాగా పని చేసిన సిబ్బందికి ఈ సందర్భంగా సరిఫికెట్స్,ప్రోత్సాహకాలు అందించారు.మెగా లోక్ అదాలత్ నందు జిల్లా వ్యాప్తంగా 5600 కేసులను పరిష్కరించడం పట్ల బాగా పని చేసిన పోలీసు అధికారులను,సిబ్బందిని అభనందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టికల్ పోలీస్ పని విభాగాల ద్వారా అత్యంత వేగవంతమైన సేవలు అందిచేలా డీజీపీ ప్రత్యేక కార్యాచరణ చేశారని,ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని సిబ్బందిని ఆదేశించారు.అంతర్జాల నమోదు కేసుల పరిష్కారంలో చురుకుగా పని చేయాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే మంచి పేరు,పోలీసు ఇమేజ్ పెరుగుతుంది,గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు.ప్రజలు మనకు ఎంతో నమ్మకంతో అధికారం, బాధ్యతలు ఇచ్చారని,వాటిని సక్రమంగా నిర్వర్తించి అక్రమ కార్యకలాపాలు,అసాంఘిక చర్యలు,అక్రమ రవాణా,అక్రమ వ్యాపారాలు అడ్డుకోవాలని,సమాజ భద్రతకు,ప్రజలను మోసాలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు,ప్రజలకు భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

జిల్లాలో నమోదౌతున్న కేసులు,ఫిర్యాదులు,పోలీసు సేవల సద్వినియోగంపై సమీక్ష చేయడం జరిగిందని,కేసులు పెండింగ్ ఉండకుండా కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలని అన్నారు.ప్రతి ఫిర్యాదును జెన్యూన్ గా ప్రాథమిక విచారణ జరపాలని బాధితులకు భరోసా కల్పించాలన్నారు.

ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని,విజువల్ పోలీసింగ్ చేయాలని సూచించారు.పోలీసు స్టేషన్ల నందు క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి సూచించారు.

పిటిషన్ మేనేజ్మెంట్,అంతర్జాల నమోదు,సైబర్ ఫ్రాడ్స్ నివారణకు కృషి చేయాలన్నారు.అసాంఘిక చర్యలు, అక్రమ వ్యాపారాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

రోడ్డు భద్రతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని,రోడ్డు నియమనిభందనలు పాటించాలన్నారు.మైనర్స్ కు వాహనాలు ఇవ్వొద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితిరాజ్,డిఎస్పీలు రఘు,మోహన్ కుమార్,సిఐలు శ్రీనివాస్,విఠల్ రెడ్డి,ఆంజనేయులు, రాజేష్,రామలింగారెడ్డి,నర్సింహారావు,పిఎన్డి ప్రసాద్,నాగార్జున,మునగాల సిఐ ఆంజనేయులు, ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube