సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు,మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామంలో ఆగి ఉన్న పత్తిలోడు లారీపై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.లారీలో డ్రైవర్,క్లీనర్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.