రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్ఆర్ విడుదలకు సిద్ధమైంది.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా లో ముఖ్య పాత్ర లో నటించాడు.ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.
సినిమా మార్చి 25 తారీఖున భారీగా విడుదల నేపథ్యం లో అతి త్వరలోనే భారీ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈవెంట్ కు చిరంజీవి మరియు బాలకృష్ణ పాల్గొనబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
నందమూరి మరియు మెగా ఫ్యామిలీ లకు సంబంధించిన హీరోల సినిమా అవ్వడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఖచ్చితంగా భారీ ఎత్తున అభిమానులు వస్తారు.
వారిని సంతృప్తి పరచడానికి బాలకృష్ణ మరియు చిరంజీవులు వస్తే బాగుంటుందని రాజమౌళి భావించాడు.అందుకే స్వయంగా రాజమౌళి వారిని ఆహ్వానించారని సమాచారం అందుతుంది.టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొంటారని సమాచారం.తాజాగా అందుతున్న ప్రకారం ఇప్పటికే వీరిద్దరు కూడా ఈ ఈ వెంట్ కు హాజరు అయ్యేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

రాష్ట్రంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.అమెరికా లో ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమా 10 మిలియన్ల డాలర్లను అక్కడ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.ఇంతటి భారీ సినిమా కు ఇద్దరు స్టార్ హీరో లు వస్తే మరింత అంచనాలు పెరిగాయి అవకాశాలు ఉన్నాయంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.