చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి పెర‌గాలా? అయితే మీరీ డ్రింక్ తాగాల్సిందే!

ప్ర‌స్తుతం శీతాకాలం కొన‌సాగుతోంది.రోజు రోజుకు చ‌లి పెరిగిపోతోంది.అయితే అంద‌రిలోనూ చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ఒకేలా ఉండ‌దు.కొంద‌రు చ‌లి ఎంత తీవ్రంగా ఉన్నా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రు.కానీ, కొంద‌రు మాత్రం కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతుంటారు.ఇలాంటి వారు చ‌లి కాలంలో ఎంతో ఇబ్బంది ప‌డిపోతారు.

 Healthy Winter Drink, Winter Drink, Health, Health Tips, Good Health, Winter Se-TeluguStop.com

ముఖ్యంగా వీళ్లు ఉద‌యం ఎనిమిది, సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత చ‌లి కార‌ణంగా కాలు బ‌య‌ట పెట్ట‌డానికే భయ‌ప‌డిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక చ‌లిని త‌ట్టుకునే శ‌క్తిని అద్భుతంగా పెంపొందించుకోవ‌చ్చు.

Telugu Tips, Healthy, Season-Telugu Health - తెలుగు హెల్త

మ‌రి ఆ సూప‌ర్ డ్రింక్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గుప్పెడు బాదం ప‌ప్పుల‌ను తీసుకుని వాట‌ర్‌లో ప‌న్నెండు గంట‌ల పాటు నాన బెట్టుకుని.

ఆపై పొట్టు తీసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం ప‌ప్పుల‌ను వేసి చాలా మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులోనే ఒక క‌ప్పు కొబ్బ‌రి పాలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు యాలిక‌ల పొడి, చిటికెడు ప‌సుపు, అర టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని మ‌రోసారి గ్రౌండ్ చేసి.గ్లాస్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఇందులో రుచికి స‌రిప‌డా బెల్లం క‌లుపుకుంటే సూప‌ర్ ఎఫెక్టివ్ డ్రింక్ రెడీ అయిన‌ట్టే.ఈ డ్రింక్‌ను క‌నీసం రెండు రోజుల‌కు ఒక సారి తీసుకుంటే గ‌నుక శీతాకాలంలో చ‌లిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం సూప‌ర్‌గా పెరుగుతుంది.

అంతే కాదు, ఈ డ్రింక్‌ను సేవించ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లప‌డుతుంది.చ‌లికాలంలో వేధించి జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Tips, Healthy, Season-Telugu Health - తెలుగు హెల్త

గుండె ఆరోగ్యంగా మారుతుంది.చ‌ర్మం త‌ర‌చూ పొడి బార‌కుండా ఉంటుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.కాబ‌ట్టి, పిల్ల‌లు.పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎవ్వ‌రైనా ఈ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube