పేకాట స్థావరాలపై పోలిసుల మెరుపు దాడి

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై శనివారం టాస్క్ ఫోర్స్,పోలీసులు, చిట్యాల సీఐ శివరాంరెడ్డి బృందంతో కలిసి పక్కా సమాచారం మేరకు మూకుమ్మడిగా మెరుపు దాడి చేశారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ శివరాంరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల శివారులో కొనతం సత్తిరెడ్డి వ్యవసాయ బావి వద్ద తోట పరిసరాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి యధేచ్ఛగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతోనే స్థావరాలపై దాడులు చేశామన్నారు.

 Police Blitz On Poker Bases , Ci Sivaram Reddy, Nakirekal Constituency, Gunti Ki-TeluguStop.com

ఈ దాడిలో 12 మంది పేకాట రాయుళ్ళ అదుపులోకి తీసుకోగా ఒక్కరు పరారయ్యారని అన్నారు.

వీరి వద్ద నుండి‌ 3 కార్లు,2 బైకులు,12 సెల్ ఫోన్లు,3 లక్షల 37 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

గుంటి కిరణ్, పగిళ్ళ రమేష్ లు పేకాటకు స్థావరాలను ఏర్పాటు చేసి ఈ పేకాట రాయుళ్ళకి అన్ని వసతులు సమకూర్చి వారి దగ్గర కమిషన్లు తీసుకుంటూ ప్రోత్సహిస్టున్నట్లు తెలిసిందన్నారు.పరారైన వ్యక్తి కోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే అతనిని కూడా పట్టుకొని రిమాండ్ కి పంపుతామని,మిగతా 12 మందిని నల్గొండ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube