Minister Uttam Kumar Reddy : మంచినీటి సమస్య రాకుండా చూడండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని, అధికారం ఇచ్చిన ప్రజలకు అందరం కలిసి చిత్తశుద్దితో సేవ చేయాలని,తాగునీటి సమస్య రాకుండా చూడాలని రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అధికారులను ఆదేశించారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.

 Ensure Fresh Water Problem Does Not Arise Minister Uttam Kumar Reddy-TeluguStop.com

మొదటగా హుజూర్ నగర్ టౌన్ హాల్‌ సందర్శించి అప్‌గ్రేడేషన్‌ కోసం కోటి రూపాయలతో చేపట్టే పనులపై సమీక్ష చేశారు.క్రిస్టియన్‌ శ్మశాన వాటిక స్థలాన్ని( Christian burial ground ) సందర్శించి రూ.50 లక్షలతో చేపట్టే పనులను, సమీపంలోని హౌసింగ్ కాలనీలో రూ.70 కోట్లతో జరుగుతున్న పనులను, తర్వాత హుజూర్‌ నగర్ ప్రధాన రహదారి పనుల తీరును పరిశీలించారు.
ఎన్ఆర్ఈజీఎస్,తాగునీటి సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, కుదిరితే పులిచింతల బ్యాక్ వాటర్ పైపుల ద్వారా తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉన్న బోర్లన్ని రీప్రెస్ చేసి అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో( District Collector S Venkatrao ) కలిసి హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తాగునీటి మరియు ఇతర నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, తాగునీటి కొరత లేకుండా చూడాలని, అధికారులు సమర్థవంతంగా పని చేయాలన్నారు.ఈ క్రమంలో అధికారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కష్టపడి పని చేయాలన్నారు.కోర్టు కాంప్లెక్స్ కొరకు 5 ఎకరాలు భూమి కేటాయించాలని బార్ అసోసియేషన్ కోరగా అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఆర్టీవోని మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ,పంచాయతీరాజ్,రెవిన్యూ అధికారులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube