సూర్యాపేట జిల్లా:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రాబోయే 48 గంటల్లో రద్దు చేయని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధినేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు గురువారం కోదాడలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో ఆమరణ దీక్ష ప్రారంభించిన సమయానికే కోదాడ పట్టణంలో నేను సైతం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంత వరకు ఒక సామజిక ఉద్యమకారుడిగా నా కర్తవ్యాన్ని,భాద్యతను నిర్వర్తిస్తానని తెలిపారు.ఈ దీక్షకు ఈ ప్రాంత నిరుద్యోగ యువతసంఘీభావం తెలియజేయాలని కోరారు.