చిరంజీవి హీరోగా నాగ‌బాబు ప్రొడ్యూస‌ర్ గా ఎన్ని సినిమాలు చేసారో తెలుసా..?

చిరంజీవి.తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

 How Many Chiranjeevi Movies Produced By Naga Babu, Chirenjeevi, Nagababu, Pawan-TeluguStop.com

ఎన్నో చిత్రాల్లో త‌న అద్భుత న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నాడు.ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

మెగాస్టార్‌గా అవ‌త‌రించాడు.ఇప్ప‌టికీ త‌న న‌ట‌నాకౌశ‌ల్యంతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

యువ హీరోల‌కు సాధ్యంకాని ఫీట్లు సాధిస్తూనే ఉన్నాడు.

చిరంజీవి ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నాక.

త‌న త‌మ్ముళ్ల‌పై దృష్టి పెట్టాడు.పెద్ద త‌మ్ముడు నాగ‌బాబు, చిన్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హీరోలుగా చేయాల‌నుకున్నాడు.

చిన్న త‌మ్ముడు ప‌వ‌న్ త్వ‌ర‌లోనే హీరోగా త‌న స‌త్తా చాటుకున్నాడు.త‌న న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానులను ద‌క్కించుకున్నాడు.

అయితే పెద్ద త‌మ్ముడు నాగ‌బాబు హీరోగా వ‌ర్క‌వుట్ కాలేక‌పోయాడు.కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా.

అంత‌గా స‌క్సెస్ కాలేదు.అందుకే సినీ నిర్మాణ రంగం వైపు ఆయ‌న అడుగులు వేశాడు.

త‌న అన్న చిరంజీవి స‌పోర్టుతో.త‌న త‌ల్లి అంజ‌నాదేవి పేరిట‌.

అంజ‌నా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నెల‌కొల్పాడు.ఈ బ్యాన్‌లో చిరంజీవి 5 సినిమాలు చేశాడు.ఇంత‌కీ ఆ సినిమాలు ఎలా ఆడాయో ఇప్పుడు తెలుసుకుందా!

రుద్రవీణ

Telugu Anjana Devi, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Rudraveena, Stalin-Telu

త‌మ్ముడి సొంత బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తొలి చిత్రం రుద్ర‌వీణ‌.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడ‌లేదు.ప్రేక్ష‌కుల నుంచి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.ఓ జాతీయ అవార్డును మాత్రం ఈ సినిమా ద‌క్కించుకుంది.

త్రినేత్రుడు

Telugu Anjana Devi, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Rudraveena, Stalin-Telu

చిరంజీవి త‌న 100వ చిత్రంగా ఈ సినిమా చేశాడు.అంజ‌నా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.కెరీర్‌ప‌రంగా ఎంతో స్సెష‌ల్ అయిన ఈ మూవీ మాత్రం స‌క్సెస్ కాలేదు.త‌న సినీకెరీర్‌లోని డిజాస్ట‌ర్ చిత్ర‌లా లిస్టులో త్రినేత్రుడు నిలిచిపోయింది.

ముగ్గురు మొనగాళ్లు

Telugu Anjana Devi, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Rudraveena, Stalin-Telu

ఈ సినిమాలో చిరంజీవి మూడు క్యారెక్ట‌ర్లు చేశారు.అంజ‌నా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ మీద రాఘ‌వేంద్ర రావు ఈ సినిమాను రూపొందించాడు.ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.చిరంజీవితో పాటు అంజనా బ్యాన‌ర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

బావగారు బాగున్నారా

Telugu Anjana Devi, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Rudraveena, Stalin-Telu

చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ చిత్రాలో ఇదీ ఇక‌టి.అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వ‌చ్చిన ఈ మూవీకి జ‌యంత్ ప‌రాన్జీ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకు అద్భుత ప్రేక్ష‌క ఆద‌ర‌ణ ల‌భించింది.వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.

స్టాలిన్

Telugu Anjana Devi, Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Rudraveena, Stalin-Telu

చిరు హీరోగా, నాగ‌బాబు ప్రొడ్యూస‌ర్ గా ఈ చిత్రం రూపొందింది.మురుగ‌దాస్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.అయితే ప్రేక్ష‌కుల నుంచి అనుకున్నంత స్థాయిలో ఆద‌ర‌ణ రాలేదు.యావ‌రేజ్ మూవీగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube