పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే జుట్టును సిల్కీగా మార్చుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు సిల్కీ హెయిర్( Silky Hair ) ను బాగా ఇష్టపడుతుంటారు.

ఈ నేపథ్యంలోనే సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి జుట్టును సిల్కీగా మార్పించుకుంటూ ఉంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి పూర్తిగా ఉడికించాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించి చ‌ల్లార‌పెట్టుకున్న‌ ఓట్స్ మిశ్రమాన్ని వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బట్టర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ), రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఇందులో ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు సిల్కీగా మరియు సూపర్ స్మూత్( Smooth and Silky Hair ) గా మారుతుంది.కాబ‌ట్టి, పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా సిల్కీ హెయిర్ ను పొందాలని కోరుకునే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా ఈ రెమెడీని పాటించ‌డం వల్ల జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.కురులు ఒత్తుగా సైతం పెరుగుతాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు