యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఒకరి కెరీర్ కు మరొకరు సహాయ సహకారాలను అందించుకోవడం జరిగింది.
స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి సినిమాల విజయాలతో అటు ఎన్టీఆర్ ఇటు రాజమౌళి కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అయితే తాజాగా ఒక ఈవెంట్ లో రాజమౌళి( Rajamouli )యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు అని చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జక్కన్న చూపించిన ప్రేమకు ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదని తమ్ముడిలాంటి వాడని బాహుబలి సినిమా నిర్మాతలు ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్( Junior ntr ) ను రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్ గా పేర్కొనడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.ఎన్టీఆర్ రాజమౌళి కాంబో హిట్ కాంబో అని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్2 ( RRR2 )తెరకెక్కితే బాగుంటుందని కొంతమంది చెబుతుండగా ఎన్టీఆర్ సోలో హీరోగా జక్కన్న డైరెక్షన్ లో సినిమా రావాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఎదురుచూపులు తప్పవని చెప్పవచ్చు.
రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ అంటే ఇతర సినిమాలను పూర్తి చేసి డేట్స్ కేటాయించడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.ఎన్టీఆర్ రాజమౌళి కాంబో స్పెషల్ కాంబో అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.