సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలలో వారబంది పద్ధతిని బంద్ చేయాలి:సీపీఐ

పోకల వెంకటేశ్వర్లు సిపిఐ సూర్యాపేట జిల్లా:నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో పుష్కలంగా నీరు ఉండి కూడా ప్రభుత్వం వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయటం వలన నీరు లేక వరి పోలాలకు అగ్గిరోగం వచ్చి రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారని,ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతికి స్వస్తి చెప్పి ప్రతిరోజు సాగర్ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తూ గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం వరి పంటలు వేసుకోమని,అది కూడా సన్న రకాలను వేసుకోమని చెప్పి,ఆరుతడి పంటల మాదిరిగా వారబంది పద్దతిలో నీటిని విడుదల చేయటంలో అర్ధం లేదన్నారు.

 Warabandi Method Of Releasing Water To Sagar Ayakattu Should Be Stopped: Pokala-TeluguStop.com

ప్రభుత్వానికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని,వరికి పూర్తి స్థాయిలో నీరు వుంటేనే పంట పండుతుందని,నీరు లేనందున అగ్గితెగులు రోగం వచ్చి వరి పంటలు కుంగి పోతున్నాయని, మందులు పిచికారీ చేసినా అగ్గితెగులు రోగం కంట్రోల్ కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సాగర్ ప్రాజెక్టులో వచ్చే వానాకాల పంటలకు కూడా సరిపోను నీళ్లు వున్నా రైతులను వారబంది పద్ధతితో వేధించటం సరికాదని అన్నారు.24 గంటల కరెంట్ పత్రికలు,వేదికలకే పరిమితం అయిందని, రాత్రి,పగలు కలిసి కూడా ఎనిమిది,తొమ్మిది గంటల కరెంట్ ఉండటం లేదన్నారు.ఈ పంట చేతికి వచ్చేవరకైనా రోజుకు 15 గంటల కరెంట్ ఇవ్వాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube