సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలలో వారబంది పద్ధతిని బంద్ చేయాలి:సీపీఐ
TeluguStop.com
పోకల వెంకటేశ్వర్లు సిపిఐ సూర్యాపేట జిల్లా:నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో పుష్కలంగా నీరు ఉండి కూడా ప్రభుత్వం వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయటం వలన నీరు లేక వరి పోలాలకు అగ్గిరోగం వచ్చి రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారని,ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతికి స్వస్తి చెప్పి ప్రతిరోజు సాగర్ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తూ గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం వరి పంటలు వేసుకోమని,అది కూడా సన్న రకాలను వేసుకోమని చెప్పి,ఆరుతడి పంటల మాదిరిగా వారబంది పద్దతిలో నీటిని విడుదల చేయటంలో అర్ధం లేదన్నారు.
ప్రభుత్వానికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని,వరికి పూర్తి స్థాయిలో నీరు వుంటేనే పంట పండుతుందని,నీరు లేనందున అగ్గితెగులు రోగం వచ్చి వరి పంటలు కుంగి పోతున్నాయని, మందులు పిచికారీ చేసినా అగ్గితెగులు రోగం కంట్రోల్ కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ ప్రాజెక్టులో వచ్చే వానాకాల పంటలకు కూడా సరిపోను నీళ్లు వున్నా రైతులను వారబంది పద్ధతితో వేధించటం సరికాదని అన్నారు.
24 గంటల కరెంట్ పత్రికలు,వేదికలకే పరిమితం అయిందని, రాత్రి,పగలు కలిసి కూడా ఎనిమిది,తొమ్మిది గంటల కరెంట్ ఉండటం లేదన్నారు.
ఈ పంట చేతికి వచ్చేవరకైనా రోజుకు 15 గంటల కరెంట్ ఇవ్వాలని కోరారు.
మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!