సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద కోదాడ వైపుకు వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన పూల మొక్కల వద్ద రెండు రోజుల క్రితం చెత్త వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపైన చెత్త వేసివారిని గుర్తించి రూ.1000 ఫైన్ విధించారు.ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తే పైకం కట్టాల్సిందేనని వార్నింగ్ జారీ చేశారు.