కబ్జా కోరల్లో కల్మలచెరువు ఊర చెరువు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ ఊర చెరువును కొందరు మట్టితో పూడుస్తూ గత కొన్ని రోజులుగా కబ్జాకు పాల్పడుతున్నారని మత్స్య సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.కల్మలచెరువు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సైదులు,బిట్టు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన రాకపోవటంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోయి చెరువు శిఖం మట్టితో పూడ్చి వేస్తున్నారని,దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని వాపోయారు.

 Kalmalacheruvu Village Pond In Kabja Koralo , Kalmalacheruvu Village, Bittu Venk-TeluguStop.com

రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తోడేస్తూ, చెరువును కుంటగా మారుస్తున్నారని,దీని వల్ల భావితరాలకు భూగర్భ జలాలు అడుగంటి బావుల్లో,బోర్లల్లో నీరు దొరకని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఊర చెరువు సర్వే చేయించి, చుట్టు పక్కల హద్దు రాళ్ళను నిర్ణయించి ఊర చెరువును కాపాడాలని, ఊర చెరువును అక్రమించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube