స్త్రీ నిధి ఋణాల చెల్లింపులో అలసత్వం చేస్తే చర్యలు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:స్త్రీ నిధి ఋణాల చెల్లింపుల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లైతే రికవరీతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ హెచ్చరించారు.పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశానికి కలెక్టర్ హాజరై సంఘాల పని తీరు, నిర్వహణపై మహిళా సమాఖ్య నెల వారి సమావేశ ఎజెండా అంశాలను పరిశీలించారు.

 If A Woman Defaults In Payment Of Fund Debts, Action Is Taken By The Collector ,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల నెలవారి సమావేశాలు క్రమం తపప్పకుండా నిర్వహించాలని చర్చలు అర్దవంతంగా జరగాలని,అన్నీ అంశాలను ప్రతి సభ్యురాలికి చెరవేయవలేనని ఆదేశించారు.బ్యాంక్ అంశాలకు సంబందించి జిల్లాలో 474 కోట్ల రూపాయలను వివిధ బ్యాంక్ ల ద్వారా అందించటం జరిగింది.

ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబందించి 707 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు అందించనున్నామని పేర్కొన్నారు.ప్రతి సభ్యురాలు అన్ని విధాల ఆర్దికవేత్తలుగా ఎదగాలని,పారిశ్రామిక వేత్తలుగా రాణించాలంటే ఏదైతే యూనిట్ నెలకొల్పలి అనుకుంటే దానిపై సమగ్ర మైక్రోక్రెడిట్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు.

మహిళా శక్తికి సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా సమగ్రమైన సమాచారాన్ని గ్రామీణ స్థాయి వరకు సమాచారం ఇచ్చి,మైక్రో క్రెడిట్ ప్లాన్ లు తయారు చేసుకొని పారదర్శకంగా అమలు జరిగేలా సిబ్బంది అందరూ పని చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పీడీ మధుసూదన్ రాజు,ఆడిషినల్ డిఆర్డీవో రామ సురేష్, ఎంపిడిఓ వెంకటేశ్వరరావు, ఎపిఎం అజయ్,డిపిఎం రత్తయ్య లక్ష్మీనారాయణ, అధ్యక్షరాలు మంజుల,మహిళ సంఘాల సభ్యులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube