ప్రభుత్వ భూములన్నీ అధికార పార్టీ నేతలే కబ్జా చేశారు:కొత్తపల్లి శివకుమార్

సూర్యాపేట జిల్లా:కోదాడ (Kodad )నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లేదా 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, ఇచ్చే వరకు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ (Kottapalli Sivakumar )అన్నారు.

 All The Government Lands Have Been Captured By The Ruling Party Leaders: Kottapa-TeluguStop.com

మంగళవారం కోదాడ పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు,ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా పంథా ఆధ్వర్యంలో శ్రీనివాస ధియేటర్ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టి,ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ డివిజన్లో ప్రభుత్వ భూములు మొత్తం అధికార పార్టీ నాయకులు లేదా వారి అనుచరులు కబ్జా చేసుకుని ఉన్నారని, ఆ ప్రభుత్వ భూమిని కబ్జాకోరాల నుంచి విడిపించి అర్హులైన పేదలందరికీ 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.

లేదా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు.ఒకవేళ ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మేమే ఆభూముల్లో ఎర్రజెండాలపాతి పేదలకు పంచి పెడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాపందా డివిజన్ కార్యదర్శి మట్టపల్లి అంజన్న,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామోజీ,పిఓఎల్ జిల్లా నాయకులు వీరబాబు, శ్రీకాంత్,పిఓడబ్ల్యు నాయకులు నాగమణి,( Nagamani ) సౌజన్య,నాగమణి, నాగమ్మ,సంపూర్ణ పివైఎల్ జిల్లా నాయకులు అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube