సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణం( Nereducharla )లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారి, ప్రజలకు ముప్పు పొంచి ఉందని,స్తంభం ఎప్పుడు కింద పడిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.ఈ పక్కనే పోలీస్ స్టేషన్, తహశీల్దార్,మండల ప్రజా పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయని,పక్కనే పంట పొలాలు సైతం ఉండడంతో నిత్యం ఈ రహదారి వెంట ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు
రోజూ విద్యుత్ అధికారులు( Electricity authorities ) చూస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి ప్రమాదం సంభవించకముందే,స్తంభానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.