యాదాద్రి భువనగిరి జిల్లా: అమాయక హిందూ ప్రజలని చంపిన ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ హెచ్చరించారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారంలో ఆయన మాట్లాడుతూ
ఉగ్రవాదుల్లారా,దేశద్రోహుల్లారా ఖబర్దార్ అతికొద్ది రోజుల్లో ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని, వారికి సహకరిస్తున్న దేశద్రోహులను కూడా ఏరివేస్తామని తెలిపారు.
ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీస్ శాఖకు లేదా ఆన్లైన్లో భారతీయ ఆర్మీకి లేదా సెంట్రల్ మినిస్టర్లకు మెయిల్స్ ద్వారా సందేశం ఇవ్వాలని కోరారు.