సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం పెదవీడు పోస్ట్ ఆఫీస్ వద్ద పించన్ కోసం వయోవృద్ధులు,వితంతులు,ఒంటరి మహిళలు పొద్దంతా పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పొద్దున్న 9 గంటలకు పింఛను కోసం వచ్చామని, ఇక్కడ కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేదని,అసలే ఎండాకాలం కావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని,సకాలంలో పింఛను అందజేయాలని కోరుతున్నారు.







