మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు అందజేయాలి: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

జిల్లాలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( District Collector S Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ రుణాలు మంజూరుకు సంఘ ప్రతినిధుల,బ్యాంక్ అధికారులను సమన్వయం చేయాలని సూచించారు.గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను మత్స్య శాఖకు బదలాయింపు చేసి,అన్ని గ్రామ పంచాయితీలకు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీల్లో ఎండిపోయిన చెరువుల రకం (లీజు) నిబంధనల మేరకు మాఫీ చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అన్ని నియోజకవర్గాల్లో మత్స్యకారుల సొసైటీల బలోపేతానికి అలాగే సమస్యల పరిష్కారానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఎక్కడ కూడా చెరువులు కబ్జాలు కాకుండా ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు,పంచాయతీ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా సంఘాల చీఫ్ ప్రమోటర్ బి.శ్రీనివాస్,వివిధ మండలాల సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News