సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కోదాడ ఎంపీడీవో రామచందర్ రావు శనివారం సందర్శించి పాఠశాల తరగతి గదులను పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన వివరాలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనం అందించాలని,నీళ్ల ట్యాంకులను ప్రతిరోజు శుభ్రపరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







