సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 9వ, వర్ధంతి పోస్టర్లను ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కామల్ల నవీన్ ఆవిష్కరించారు.భూమి,భుక్తి,విముక్తి కోసం జరిగిన పోరాటంలో కామ్రేడ్ రాయల రవన్నది క్రియాశీలక పాత్రని,అనేక నిర్బంధాలను, ఎన్కౌంటర్లను ఎదుర్కొని 48 ఏళ్ల అజ్ఞాత జీవితంలో వెనకడుగు వేయకుండా ప్రజా పోరాటాలకు మార్గం చూపాడని కొనియాడారు.
ఈ నెల 11న ఖమ్మంలో జరిగే కామ్రేడ్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభకు ప్రజాస్వామ్యవాదులు,పార్టీ శ్రేణులు,కవులు,కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గండు వెంకన్న,చింతమల్ల అంజయ్య,కోడి సైదులు,కోడి వెంకటేశ్వర్లు,బత్తిని సైదులు, నాగేష్,సర్వయ్య,ముత్తయ్య,వెంకటేశ్వర్లు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







