ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవడం కోసం చాలా మంది మార్కెట్‌లో లభమయ్యే స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ క్రీమ్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.తరచూ బ్యూటీపార్లర్‌లో ఫేషియల్స్, బ్లీచ్‌లు చేయించుకుంటారు.
ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.అయితే ఇంట్లోనే తక్కువ బడ్జెట్‌తో కూడా ముఖాన్ని వైట్‌గా, బ్రైట్‌గా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ సూపర్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.మరి ఆ క్రీమ్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను బ్లెండర్ తో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో బీట్ రూట్ జ్యూస్‌ను వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించి.
చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్, వన్ టేబుల్ స్పూన్ బీస్ వ్యాక్స్ తురుము వేసుకుని మరుగుతున్న నీటిలో పెట్టి మెల్ట్ చేసుకోవాలి.
ఇలా మెల్ట్ అయిన మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్, చిటికెడు పసుపు వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే హోం మేడ్ బీట్ రూట్ ఫేస్ క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్‌ను ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే.రెండు వారాల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు వాటర్‌తో ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని.
అప్పుడు తయారు చేసుకున్న బీట్ రూట్ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక స్కిన్ న్యాచురల్‌గానే వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.
చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా క్రమంగా తొలగిపోతాయి.