తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలలో దాదాపు 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అదేవిధంగా హుండీ ద్వారా శ్రీవారికి రూ.140 కోట్ల 7 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.దాదాపు 10 లక్షల 79 వేల 9 వందల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.







