బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో ఏదో ఒక చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో తజ్జనభజన పడుతోంది.
వీరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ముందుగానే వీరిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా బీఆర్ఎస్ ( BRS party )నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటుపడే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు న్యాయనిపరులు పేర్కొంటున్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని లేకపోతే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేయడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది తేలాల్సి ఉంది.స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతున్నా.దానం నాగేందర్( Danam Nagender ) తో రాజీనామా చేయించడమే మంచిది అని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండే కంటే, ముందే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ భావిస్తుంది .అయితే దానం నాగేందర్ ఇందుకు సముఖంగా లేనట్లు సమాచారం.

2004 అసెంబ్లీ ఎన్నికలలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి టిడిపి( TDP )లో చేరి ఆసిఫ్ నగర్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.ఆ తరువాత తన సీటుకు రాజీనామా చేశారు.అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి చెందారు.
దీంతో ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తానా లేదా అనే సందేహం కూడా దానం నాగేందర్ లో ఉందట.దీనికి కారణం లో ఆయన గ్రాఫ్ తగ్గడమే.
ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే, ఆ ఎన్నికల్లో ఓటమి చెందితే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయమూ నాగేందర్ లో ఉందట. అందుకే కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తున్నా, ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలుసుకోలేక సతమతము అవుతున్నారట.