మృదువైన, మెరిసే చర్మం కోసం అందరూ తహ తహ లాడు తుంటారు.అందుకోసం మార్కెట్‌లో దొరికే ఖరీదైన క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే ఇంట్లో కొన్ని కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కూడా మృదువైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు.ముఖ్యంగా పాల పొడి ఇందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
మరి పాల పొడిని ఎలా యూజ్ చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాల పొడి, చందనం పొడి మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.పావు గంట పాటు ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటే.ముడతలు పోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
అలాగే ఒక్ బౌల్‌లో పాల పొడి, బాదం పొడి మరియు గోరు వెచ్చని నీరు పోసి కలుపు కోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రంతో ఫేస్ ప్యాక్ వేసుకుని ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కొద్దిగా నీళ్లు జల్లి వేళ్లతో రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ నల్ల మచ్చలు పోవడంతో పాటు చర్మ ఛాయ పెరుగుతుంది.
ఇక పాల పొడి, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ ఈ మూడిటినీ ఒక బౌల్‌లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు పాటు వదిలేయాలి.
ఆ తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే మొటిమలు పోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.