తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్.( Ram Charan ) చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కూడా వెలుగొందుతున్నాడు.ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా తన నట విశ్వరూపాన్ని చూపించిన ఆయన ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చాలావరకు ఫేమస్ అయ్యాడు.
ముఖ్యంగా ఆయన ‘గ్లోబల్ స్టార్’ గా కూడా అవతరించాడు.
ఇక అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా( Game Changer Movie ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కుతూ ఉంటుంది.ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా శంకర్( Director Shankar ) డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 సినిమా( Bharateeyudu 2 ) ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.
దాంతో శంకర్ పేరు భారీగా డ్యామేజ్ అయింది.దానివల్ల ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులకు అంచనాలు లేకుండా పోయాయి.కానీ రామ్ చరణ్ కి ఉన్న మార్కెట్ గాని ఆయనకున్న స్టార్ డమ్ వల్ల గానీ ఈ సినిమా మీద కొంతమందిలో అంచనాలైతే ఉన్నాయి.
మరి దాన్ని అందుకోవాలంటే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడితేనే పర్లేదు లేకపోతే మాత్రం ఈ సినిమాకు భారీగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ని సాధిస్తే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లో స్టార్ హీరోగా వెలుగొందుతాడు.లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అలాగే శంకర్ కి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం అనేది చాలా కీలకంగా మారింది.ఆయన తీసిన ‘భారతీయుడు 2’ సినిమాతో భారీ విమర్శలను ఎదుర్కొన్నాడు.
మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ సాధించి మరో స్టార్ హీరోతో తన తదుపరి సినిమాను పట్టాలెక్కిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.